బాలు వాకదాని |
నా పేరు బాలు
వాకదాని(చాలా మంది పిలిచే పేరు).
తల్లితండ్రులు(వాకదాని చెంచయ్య, లక్ష్మి)
పెట్టిన పేరు వాకదాని బాలకృష్ణ. నాకు ఒక్క తమ్ముడు పేరు
శివకృష్ణ కానీ వాడికి శివ అని పిలిస్తేనే ఇష్టం.
1988 సెప్టెంబర్ 10న ఈ ప్రపంచం, ఖమ్మం జిల్లాలో నా ఉనికిని గుర్తించినది. మా నాన్న గారి ఊరు కొండకుడిమ, వైరా మండలం ఖమ్మం జిల్లా. మా చిన్నతనంలోనే ఖమ్మం వచ్చేశాము,
పెరిగింది చదివింది ఖమ్మంలోనే.
2004లో పదో
తరగతి పూర్తి చేశాను. తరువాత ఇంటర్ ఎం.పి.సి “న్యూ జనరేషన్ కాలేజీ”లో ముగిసింది.
2006 నుంచి 2010
మధ్య ఇంజనీరింగ్ జీవితం శారద కాలేజీలో. ఎప్పటికి మరచి పోలేని జ్ఞాపకాలు మెదడు పొరలలో గుండె
గూటిలో తిరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా 2009 సెప్టెంబర్ 15న శ్రీనిధి కాలేజీలో మేము
సాధించిన ప్రధమ బహుమతి. 2010 మార్చ్ 12న మేము నిర్వహించిన ఎపిస్టమి’10, మా విజయాలకు కారణమైన మా గురువులు, మిత్రులు వారి
ప్రేమ అభిమానాలు కొలమానానికి సరితూగవు.
2010 జూలై 26న
హైదరాబాద్ మహానగరానికి అడుగుపెట్టాను. ఐ.ఎస్.టి.టి.ఎం బి.స్కూల్లో టెలికాం ఎం.బి.ఏ
చదువు ప్రారంభించాను.
నేను రైతు బిడ్డను సేద్యం అంటే ఇష్టం. అక్షర విత్తనాలను తెల్లటి కాగితపు భూమి పై చల్లుతున్నాను. అవి కవిత్వం రూపంలో నా మనసుని నింపుతున్నాయి.
నా అభిరుచులు
పుస్తకాలు చదవటం. నాకు భాగ నచ్చిన పుస్తకాలు The Alchemist(తెలుగులో
పరుశవేది), The Secret( తెలుగులో రహస్యం). మిత్రులతో కలిసి లఘు చిత్రాలు తీస్తుంటాను. ఈ మధ్య తీసిన లఘు చిత్రం “చురక”.
ఇదండీ నా(బాలు
వాకదాని) గురించి క్లుప్తంగా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి