ఇంటికి పోవాలి అంటే భయం
అవమానాల హారాలతో, మాటల గునపాలతో
సిద్దంగా వుంటారు ఇరుగు పొరుగు
అటు పక్క నుంచో, ఇటు పక్క నుంచో
వదినగారు అంటూ చెక్కర కోసం వచ్చి
చక్కర్లు తిరిగేలా మాట్లాడుతుంది ఒకావిడ
నా దారిద్ర్యాన్ని దండోరా వేస్తూ
నాలుగు వీధులకు చేరవేస్తుంది ఇంకో ఆవిడ
కమ్మగా నిద్రపోయి ఎన్ని రోజులైయిందో..?
ఎన్ని బాధలు ఉన్నా..
రాత్రికి అమ్మ అన్నం ముద్దలు కలిపి
నోట్లో పెడుతూ ఏరా అయ్యా
సరిగా తినడం లేదా!
సగం సిక్కిపోయినావు అంటూ అడుగుతుంటే
ఏం చెప్పాలి?