13, మే 2014, మంగళవారం

ఏం చెప్పాలి!

ఇంటికి పోవాలి అంటే భయం
అవమానాల హారాలతోమాటల గునపాలతో 
సిద్దంగా వుంటారు ఇరుగు పొరుగు  

అటు పక్క నుంచోఇటు పక్క నుంచో
వదినగారు అంటూ చెక్కర కోసం వచ్చి
చక్కర్లు తిరిగేలా మాట్లాడుతుంది ఒకావిడ

నా దారిద్ర్యాన్ని దండోరా వేస్తూ 
నాలుగు వీధులకు చేరవేస్తుంది ఇంకో ఆవిడ

కమ్మగా నిద్రపోయి ఎన్ని రోజులైయిందో..?
ఎన్ని బాధలు ఉన్నా..
రాత్రికి అమ్మ అన్నం ముద్దలు కలిపి 
నోట్లో పెడుతూ ఏరా అయ్యా
సరిగా తినడం లేదా!
సగం సిక్కిపోయినావు అంటూ అడుగుతుంటే
ఏం చెప్పాలి?

29 ఆగష్టు 2012

19, నవంబర్ 2012, సోమవారం

బాలు అక్షరామృతం


అమ్మలోని అంతరంగాలను
అలలలోని అమరత్వమును
అజంతా అందాలను
అంతర్ముఖ అలజడులను
అలవోక అలంకరణలను
అమలమైన అభినందనలను
అపురూప అపోహలను
అడవి అన్నలను
అంగడి అల్లర్లను
అరాచక అడ్డాలను
అదరాల అపురూపాలను
అనేక అసూయలను
అర్థరాత్రి అడుగులను
అనంతాల అంతాలను
అక్షరాల అమృతమును
అభివర్ణిస్తూ
అక్షరకు అంకితం
ఈ జీవితం

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఎర్రటి మెతుకులు


డేరాలురోడ్డుప్రక్కన డేరాలు
ఎర్రరంగు,బులుగు రంగు  డేరాలు
గట్టిగా బిగించిన తాళ్ళు,
లోతుగా నాటిన కడ్డీలు

పిల్లల కోడిలా  తల్లి
బండరాతిమీద సారా గుటకలు వేస్తూ కోడిపుంజు

చీకటి అలుముకున్న రాత్రి
వీధిదీపాల వెలుగులు  కొద్ది కొద్దిగా డేరాలో జొరబడి,
యుద్దం చేస్తున్నాయ్ చీకటి మీదకానీ గెలవడం లేదు

చలికాలంచల్లటిగాలి రివ్వురివ్వున తాండవం చేస్తుంది 
పున్నమిరాత్రిపుట్టెడు దుఖంతో గొడ్డుకారం కలిపిన నూకలబువ్వ
 పిల్లల కోడి తన పిల్లలకు ఎర్రటి మెతుకులు తినిపిస్తోంది